నరేంద్ర మోడీ, అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి మాట్లాడుతూ గతంలో పసుపు రైతులు పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేశారని తెలిపారు. ఏ నాయకుడు పసుపు బోర్డు కొరకు ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ 2019లో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి పసుపు బోర్డు నిజామాబాద్ కు తీసుకురావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు....