మా ఓపిక నశించింది

0 12,653
  • ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని.. మా ఓపిక నశించి విద్యా సంస్థలను మూసుకునే పరిస్థతి వచ్చిందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి,నరాల సుధాకర్ అన్నారు. నగరంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ పైన మాకు ఎన్నో ఆశలను రేకెత్తించిందన్నారు. గత ప్రభుత్వం ఒక సంవత్సరం ఫీజులను మరొక సంవత్సరం ఇవ్వడంతోనే ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నామన్నారు.  ఈ ప్రభుత్వంపై గంపెడు ఆశలతో మేము విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించామని, కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న గాని పాత బిల్లులకు మోక్షం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని విధాలుగా విన్నవించుకున్నా గాని మా అభ్యర్థనలను పెడచెవిన పెట్టారన్నారు. న్యాయంగా మాకు రావలసిన స్కాలర్షిప్ డబ్బుల కొరకు గతంలో బందు పెట్టామని, ప్రభుత్వం తరఫున మాతో మాట్లాడి. విద్యార్థులకు, మాకు రావలసిన స్కాలర్షిప్ డబ్బుల పై హామీ ఇవ్వడంతో వారిని నమ్మి గతంలో మా సమ్మెను విరమిచామని తెలిపారు. కానీ  ఇప్పటివరకు మాకు రావాల్సిన బకాయిల్లో నుండి కనీసం 10% డబ్బులు కూడా రాలేదన్నారు. ప్రతినెల మేము ఒక కాలేజీ నడపడానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మా దగ్గర ఉన్న ఫిక్స్ డిపాజిట్ డబ్బులు అయిపోయాయని, మా పర్సనల్ బంగారు నగలను తాకట్టు పెట్టి ఇన్ని రోజులు కళాశాలలను నడిపించామని పేర్కొన్నారు. ఇకముందు నడపడానికి మా దగ్గర ఎటువంటి  ఆదాయ వనరు లేదని ఏ ఆధారం లేనందున కాలేజీలను మూసివేశామని అన్నారు. ఇక మమ్మల్ని నీట ముంచినా పాలముంచిన ప్రభుత్వానిదే బాధ్యతని మా డబ్బులు మొత్తం వచ్చే వరకు కాలేజీలను తెరిచే ప్రసక్తి లేదని తెలిపారు. ఈ సమావేశంలో మారయ్య గౌడ్, దాసరి శంకర్, సూర్య ప్రకాష్, దత్తు శ్రీనివాస్, బాలకృష్ణ, శంకర్, శంకర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.