మా ఓపిక నశించింది
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని.. మా ఓపిక నశించి విద్యా సంస్థలను మూసుకునే పరిస్థతి వచ్చిందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి,నరాల సుధాకర్ అన్నారు. నగరంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ పైన మాకు ఎన్నో ఆశలను రేకెత్తించిందన్నారు. గత ప్రభుత్వం...