. . . కాంగ్రెస్ బలహీనపడుతుందని తెలిసినా సోనియా గాంధీ ఆమోదించారు
. . . గతంలో ఉన్న పాలకులు ప్రజలకు ఏమి చేయలేదు
. . . నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మనకు కావలసింది కొందరి చేతుల్లో బందీ అయిన బంగారు తెలంగాణ కాదు… ప్రతి పేదవాడికి సంక్షేమం అందే, ప్రతి యువకుడికి ఉద్యోగం లభించే, ప్రతి రైతు ముఖంలో నవ్వులు పూసే ప్రజల తెలంగాణ అని నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇందిరమ్మ రాజ్య స్ఫూర్తితో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎంతోమంది అమరవీరుల త్యాగాలను చూసి చలించిన తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అని ఆలోచన లేకుండా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న పాలకులు సొంత కుటుంబాలకు పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వెళుతున్నారని వారి సారథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని రామకృష్ణ అన్నారు. అనంతరం తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎఎంసి చైర్మన్ ముప్పాగంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, బంటు బలరాం, కార్పొరేటర్ అన్వర్, ఎర్రం గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీసాల సుధాకర్ రావు, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సంఘం సాయిలు, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, స్వప్న, అపర్ణ, ఏయంసి డైరెక్టర్ రఘు, పూల శంకర్, అహ్మద్, ఆకుల మహేందర్, పుప్పాల రవి, రాజు గగన్, తదితరులు పాల్గొన్నారు.

