25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.శోభారాణి, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. తదనంతరం జాతీయ జెండా ను ఎగురవేసి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

More articles

Latest article