ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

0 9,973

 

. . . సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్

 

. . . అమరవీరుల స్తూపం వద్ద విప్లవ నివాళి అర్పించిన నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటికీ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయిన ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదన్నారు.

 

Promises made to the people must be implemented.

 

నగరంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నారు. వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. మత విద్వేషాలను నియంత్రించి, లౌకిక ప్రజాస్వామ్య తెలంగాణను నిర్మించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిచో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కే.సంధ్యారాణి, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కే.గణేష్ టీయూసీఐ జిల్లా నాయకులు లింగం, కిరణ్ నాయకులు బీక్ సింగ్, విఠల్, అమూల్య, నితిన్, లక్ష్మీకాంత్, పద్మ, లక్ష్మీ, లలిత, రజియా, ఫాతిమా, దుర్గాప్రసాద్, గంగాధర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

 

Promises made to the people must be implemented.

Leave A Reply

Your email address will not be published.