బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో గ్రామ సంఘం ద్వార కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి ఏఎంసి చైర్మన్ పాలెపు నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ శాఖ మంత్రి సీతక్క మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అనేక పథకాలు మహిళలకు ఇస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ వీటితోపాటు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా మరి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం నమ్మకంతో మహిళలకు ఇచ్చినందున మహిళలు రైతుల యొక్క వడ్లు సకాలంలో కొనుగోలు చేసి డబ్బులు తొందరగా రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా మహిళలు చూడాలని ఈ సందర్భంగా మహిళలకు సూచించారు. అదేవిధంగా గుమ్మర్యాల, నాగేంద్ర నగర్, దొంచంద, గ్రామం లోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో గల కొనుగోలు కేంద్రాలను ఏఎంసి డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విష్ణువర్ధన్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపిఎం శ్యాం, ఎంఏఓ వైష్ణవ్, సీసీ నవీన్, ఏఈఓఏఎస్,అకౌంటెంట్ సుప్రియ,విఓఏ సునీత,రాజ్ కుమార్, స్రవంతి,సుజాత, సుధ,గ్రామ సంఘం అధ్యక్షురాళ్ళు సవిత,పుష్ప, నాగరాణి,స్రవంతి,సఫియా, అలివేలు, గ్రామ కార్యదర్శులు జాకీర్,రామకృష్ణ,గణేష్, డ్వాక్రా మహిళలు, గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు.
