బోధన్, బతుకమ్మ : హనుమాన్ జయంతి శాంతియుతంగా నిర్వహించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. బోధన్ అప్న ఫంక్షన్ హాల్లో బోధన్ సబ్ డివిజన్ పోలీసులు హనుమాన్ జయంతిని దృష్టిలో ఉంచుకొని శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ సాయి చైతన్య పాల్గొని మాట్లాడారు. హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలిచ్చారు. శనివారం నిర్వహించబోహే హనుమాన్ జయంతి ర్యాలీ శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిఒక్కరు పోలీసుల సూచనలు పాటించాలన్నారు…ఈ కార్యక్రమనికి హనుమాన్ భక్తులు స్వాములు పెద్దఎత్తున హాజరైయ్యారు.. ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకట నారాయణ, విజయ్ బాబు,కృష్ణ,చందర్ నాయక్,బోధన్ సబ్ డివిజన్ ఎస్సైలు ప్రవీణ్ మహారాజ్ గుండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

