28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మెడికల్ షాపులపై డ్రగ్స్ శాఖ ప్రత్యేక తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 

. . . లైసెన్స్ రద్దుకూ వెనుకాడమని హెచ్చరిక

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండల కేంద్రంలోని మెడికల్ షాపుల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై జిల్లా డ్రగ్స్ కంట్రోల్ శాఖ దృష్టి సారించింది. జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఒక మెడికల్ షాపును అధికారులు గుర్తించి, సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్ షాపుల్లో ఉండాల్సిన కనీస స్థల ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, మందుల విక్రయ విధానాలను అధికారులు పరిశీలించారు. ప్రతి మందుల విక్రయానికి వినియోగదారులకు బిల్లు ఇవ్వడం తప్పనిసరి అని, ముఖ్యంగా హెచ్-1 కేటగిరీకి చెందిన నియంత్రిత మందుల విక్రయాల కోసం ప్రత్యేక రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే లైసెన్సులను కూడా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. జుక్కల్ మండలంలోని మెడికల్ షాపులపై తరచూ తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును కట్టుదిట్టం చేయాలని స్థానిక ప్రజలు కూడా అధికారులను కోరుతున్నారు.

More articles

Latest article