24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఆన్ లైన్ లో మందుల విక్రయాలు ఆపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భారీ డిస్కౌంట్ లు ఇస్తూ నాసిరకమైన మందులను అమ్ముతున్నారు

 

. . . వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం

 

. . . జిల్లాలో ఒకరోజు మెడికల్ దుకాణాల బంద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్పొరేట్ సంస్థల ఆన్ లైన్ విక్రయాలు వెంటనే ఆపాలని జిల్లా కెమిస్ట్రీడ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షులు మధుసూదన్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త ఒకరోజు మెడికల్ దుకాణాల సమ్మె సభ లో భాగంగా నిజామాబా ద్ జిల్లా కేంద్రంలో జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛందంగా మెడికల్ షాపు బంద్ నిర్వహించారు. సుమారు జిల్లా వ్యాప్తంగా 1400 మెడికల్ దుకాణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష మధుసూదన్, ప్రధాన కార్యదర్శి బిర్కూ సుధాకర్, కోశాధికారి మొర సాయిలు మాట్లాడుతూ ఆన్ లైన్ లో అమ్మకాల పై డిస్కౌంట్లను ఇస్తూ నాసిరకం మందులను అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినప్పటికీ స్పందించక పోవడంతో దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ దుకాణాల బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఆన్ లైన్ లో అమ్మకాలు ఆపాలని, భారీ డిస్కౌంట్ లు ఇవ్వొద్దని, నాసిరకమైన మందుల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మందుల కోసం జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురవుతే మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్ధారణ చేసి వారికి మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోని మెడికల్ దుకాణాల యజమానులు, అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article