30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులకు సంవత్సరం పొడిగింపు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులకు ఒక సంవత్సరం  పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ సంస్థ చైర్మన్ సునీత కుంచాల  డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్, సుబేదార్ ఉదయ్, కృష్ణ, శుభం, ప్రమోద్ లకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పేదలకు ఈ వ్యవస్థ ద్వారా ముందు ముందు ఇంకా ప్రతిష్టంగా సేవలను అందిస్తూ చట్టబద్ధంగా సాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి పద్మావతి  పాల్గొన్నారు.

More articles

Latest article