ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం పలు వార్డుల్లో రూ.16 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణాలకు. డ్రైనేజి కీ మాజీ నీటి పారుదల సంఘం ఛైర్మెన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాళ్ల సాయి రెడ్డి ఆర్మూర్ మండల అధ్యక్షుడు సురకంటి చిన్నా రెడ్డి లు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నా యని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వారు తెలిపారు. బి ఆర్ ఎస్ పాలనలో రోడ్లు, డ్రెయిన్‌ల ఆధునీకరణ పనులను పట్టించుకోలేదన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సిసి రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాలను చేపడుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నింటినీ పూర్తి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చేపూర్ పల్లె (హరిపూర్) కాంగ్రెపార్టీ గ్రామ శాఖల పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, రాంసిన్, మాజీ సర్పంచ్ లు ఇందుర్ సాయన్న, గంగా రెడ్డి మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్, ఆర్మూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కటికే శ్రీనివాస్, సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగి శాంతి కుమార్, ఓ బి సి మండల అధ్యక్షుడు వినోద్, మాజీ వార్డ్ మెంబర్ అరె రాజు సాయన్న, సోక్కం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
