సేవలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలి  

0 1,638

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి

నిజామాబాద్, బతుకమ్మ : సంత్ సేవలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అన్నారు. శనివారంసంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంత్ సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ  దేశంలోని గిరిజనులను సన్మార్గంలో నడిపించిన గొప్ప మహానుభావులు సేవలాల్ మహారాజ్ అని పేర్కొన్నారు. సేవలాల్ మహారాజ్ జీవిత ఆశయాలను స్మరించుకుంటూ, సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓం సింగ్, నరేందర్, సరిచంద్, జగత్ సింగ్, నాగరాజు, ఇప్పాకయల కిషోర్, పద్మరెడ్డి, నాయిడి రాజన్న, సుదీప్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.