29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా షబ్బీర్ జన్మదినం

Must read

📰 Generate e-Paper Clip

. పేదలకు దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేసిన నాయకుడు గోవర్ధన్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ జన్మదినాన్ని కాంగ్రెస్ నాయకుడు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని అభయ హస్తం కాలనీలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పేదలకు దుప్పట్లు, చిన్నపిల్లలకు స్వెట్టర్లు పంపిణీ చేశారు. ఎన్నికల హామీ మేరకు  అభయహస్తం కాలనీ అభివృద్ధికి షబ్బీర్ అలీ రూ.10లక్షలు మంజూరు చేశారని  ఈ సందర్భంగా గోవర్ధన్ గుర్తు చేశారు. భాస్కర్, తుకారాం, రాములు, ఆకాశ్, నసీమా, రాహుల్, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Happy Birthday Shabbir

More articles

Latest article