సేవలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలి
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి నిజామాబాద్, బతుకమ్మ : సంత్ సేవలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అన్నారు. శనివారంసంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంత్ సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ దేశంలోని గిరిజనులను సన్మార్గంలో నడిపించిన గొప్ప మహానుభావులు...