ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల పరిధిలోని గంగారం తండా గ్రామ శివారులో ఆదివారం రాత్రి డిచ్‌పల్లి వెళ్లే రోడ్డు ఎన్ హెచ్–44 జాతీయ రహదారిలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవి పాఠక్ మృతి చెందాడు. దాబా యజమాని సమాచారం మేరకు స్థానిక ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు బిబిపూర్ తండాలోని బబ్లు యూపీ ధాబాలో కార్మికుడిగా పనిచేస్తుండేవాడని తెలిపారు. ఆదివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ధాబా నుండి వెళ్లిపోయి, ఎన్ హెచ్ – 44 పై నడుస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు ఎస్సై జి సందీప్ తెలిపారు. మృతి చెందిన పాఠాక్ శవ పంచానామా నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దాబా యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి సందీప్ తెలిపారు.

