మార్చి 10 నుంచి ప్రారంభం కానున్న వాట్సాప్ స్టేటస్ క్విజ్

0 8,866

 

. . . పడకంటి రాము

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఈ నెల 10 నుంచి వాట్సాప్ స్టేటస్ క్విజ్ ప్రారంభం కానున్నట్టు పడకంటి రాము తెలిపారు. 2019 నుంచి ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న వాట్సాప్ స్టేటస్ క్విజ్ ఈ సంవత్సరం కేవలం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే నిర్వహించటం జరుగుతుందన్నారు. వయసుతో, జెండర్ తో సంబంధం లేకుండా మార్చి 10 నుంచి మార్చి 31 వరకు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు వాట్సాప్ స్టేటస్ పై క్విజ్ ఉంటుందన్నారు. ఈ క్విజ్ లో చివరిగా ఎక్కువ స్కోర్ చేసిన టాప్ 3 విన్నర్స్ ను సెలెక్ట్ చేసి, మొదటి బహుమతి రూ. 10,000, రెండవ బహుమతి రూ.5,000, మూడవ బహుమతి రూ.2,000. తో పాటుగా పడకంటి రాము ఫౌండేషన్ తరపున సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ క్విజ్ లో పాల్గొనాలనుకునేవారు మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ,  ప్రొఫెషన్, అడ్రెస్, ఆధార్ కార్డ్/ఓటర్ ఐ డి & 1 లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో మార్చి 10, 2026 లోపు 8790720978 నెంబర్ కి వాట్సాప్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. 8790720978 నెంబర్ ను సేవ్ చేసుకోవాలని, లేదంటూ స్టేటస్ పై పెట్టే క్విజ్ కనపడదని తెలపారు. చెప్పిన తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు క్విజ్ లో పాల్గొనడానికి అర్హులు కారని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.