24 C
Hyderabad
Sunday, August 2, 2026

హిందువుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేంద్ర మంత్రి బండి సంజయ్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా బిజెపి పార్టీ కేంద్రమంత్రి బండి సంజయ్ ను సోమవారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి యాద పూర్వకంగా కలిశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో న్యాయవాది కళ్యాణి పై, ఆనంద్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళా వాగ్మరె నర్సాబాయ్ పై ఎంఐఎం పార్టీ ముష్కరులు చేసిన దాడిని బండి సంజయ్ కు వివరించారు. హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బండి సంజయ్ ను కలిసిన వారిలో బిజెపి పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ నెంబర్ ప్రశాంత్ గౌడ్, భోజిగొండ అనిల్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article