గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలోని గంగారం తండా గ్రామ శివారులో ఆదివారం రాత్రి డిచ్‌పల్లి వెళ్లే రోడ్డు ఎన్ హెచ్–44 జాతీయ రహదారిలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవి పాఠక్ మృతి చెందాడు. దాబా యజమాని సమాచారం మేరకు స్థానిక ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు బిబిపూర్ తండాలోని బబ్లు యూపీ ధాబాలో కార్మికుడిగా పనిచేస్తుండేవాడని తెలిపారు. ఆదివారం రాత్రి రెండు...