25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆటో బోల్తా పడి ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల:  ఏర్గట్ల నుండి తాళ్ళరాంపూర్ వైపు వెళ్తున్న ఆటో రాంపూర్ వడ్డెర కాలనీ దగ్గర బోల్తా పడి నిజామాబాద్ అజం కాలనీ కి చెందిన ఆలీ సాహెబ్ (68) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఏర్గట్ల గ్రామంలో జరిగిన పెళ్లికి హాజరైన ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రస్తుతం నిజామాబాద్, లో ఉంటున్న మొగులాబీ,ఆలిసాహెబ్ దంపతులు వివాహానికి హాజరై తిరిగి ప్రయాణంలో మొగులాబీ తన భర్తతో పాటు మరో ముగ్గురు మహిళలను ఏర్గట్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఆటో లో ఎక్కించారు. టీఎస్ 16 యూసీ0395 నెంబర్ గల ఆటో ఏర్గట్ల గ్రామం నుండి తాళ్ళ రాంపూర్ గ్రామం వైపు వెళుతూ తాళ్లరాంపూర్, వడ్డెర కాలనీ గ్రామ శివారు వద్దకు చేరుకోగా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా ఆటోను నడపడంతో ఆటో బోల్తాపడి అలిసాహెబ్ అనే వ్యక్తి రోడ్డుపై పడడంతో అతని తలకు, ఎడమ కాలికి గాయాలు అయ్యాయి. మిగతా ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తి ని వెంటనే అతని కుటుంబ సభ్యులు ఆర్మూర్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆయన చనిపోయినట్లు డాక్టర్ ధృవీకరించారని తెలిపారు. చనిపోయిన అలీ సాహెబ్ భార్య మొగులబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏర్గట్ల ఎస్సై రాము తెలిపారు.

More articles

Latest article