. . . సీయం పదవికి రాజీనామా చేసేది లేదు
. . . టియంసీ అధినేత్రి మమత బేనర్జీ
వెబ్ డెస్క్, బతుకమ్మ :
పశ్చిమ బెంగాల్ లో మేం ఓడిపోలేదు.. గెలిచాం అని టియంసీ అధినేత్రి మమత బేనర్జీ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఫలితాల తరువాత మంగళవారం మమత బేనర్జీ మీడియా ముందుకు వచ్చారు. అసెంబ్లి ఎన్నికల ఫలితాలలో వంద సీట్లను దొంగిలించారని అన్నారు. బిజేపి ఈసీ కుట్రవల్లే ఫలితాలు తారుమారు అయ్యాయని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అని సీఇసీ జ్ణానేష్ కుమార్ అతి పెద్ద విలన్ అని విమర్శించారు. తాను బెంగాల్ సీయం పదవికి రాజీనామా చేయను అన్నారు. అందుకు లోక్ భవన్ కు పోను.. గవర్నర్ కు రాజీనామా ఇవ్వను అన్నారు. నిన్నటి రోజున ఫలితాల సమయంలో స్ట్రాంగ్ రూంకు వేలితో తనను కడుపులో తన్ని గెంటేశారని ఆరోపణలు చేశారు. త్రుణముల్ కాంగ్రెస్ ఇండియా కూటమి లోనే ఉందని అన్నారు. ఫలితాల తరువాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారని దిది తెలిపారు. ఇండియా కూటమిగా బిజేపి ఓట్ల చోరిపై పోరాడుతామని అన్నారు. ఒక్క బెంగాల్ రాష్ట్రం లోనే సర్ పేరిట 90 లక్షల ఓట్లను తొలిగించారని అది అమిత్ షా, మోడి కన్నుసన్నులలో జరిగిందన్నారు.
