
బోధన్, బతుకమ్మ: పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సదరు వ్యక్తిని కుటుంబీకులే హతమార్చినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కురుమగల్లీకి చెందిన శంకర్(45) శనివారం రాత్రి పశువుల కొట్టంలో నిద్రించాడు. ఉదయం లేచి చూసేసరికి శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శంకర్ ఊపిరాడక మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్త చేశారు. శంకర్ చిన్న కూతురు తండ్రి మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
