7న నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం

0 1,379

నిజామాబాద్, బతుకమ్మ : ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్  విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల  మోహన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిచ్పల్లి గ్రామంలోని కేఎన్ఆర్ గార్డెన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు,మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,ఎంఎల్సీ జీవన్ రెడ్డి,రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు.   అదేవిధంగా ఈ కార్యక్రమంలోఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు, పిసిసి డెలిగేట్స్, డిసిసి డెలిగేట్స్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మున్సిపల్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.