27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నర్సింగ్ సిబ్బంది వైద్య రంగానికి వెన్నెముక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.నాగ మోహన్ రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రోగుల పట్ల కరుణ, సేవాభావం, అంకితభావంతో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది వైద్య రంగానికి వెన్నెముకలని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.నాగ మోహన్ రావు అన్నారు. మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బంది దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం నర్సింగ్ ప్రతిజ్ఞను అందరూ కలిసి స్వీకరించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ఎంసిహెచ్ బ్లాక్‌లో నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన నర్సుల సేవలు మరువలేనివని కొనియాడారు. నర్సింగ్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రవికిరణ్, ఎంసిహెచ్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ డా. శ్రీకాంత్, డా. హరీష్ స్వామి, డా. రాజేందర్, గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ, సిబ్బంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Nursing staff are the backbone of the medical sector

More articles

Latest article