. . . డైరెక్టర్ ఆపరేషన్ వరంగల్ మధుసూదన్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ ని వేసవిలో అంతరాయం లేకుండా సరఫరా చేయాలని డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ ఆదేశించారు. టిజిఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ వరంగల్ మధుసూదన్ ఆధ్వర్యంలో మంగళవారం పవర్ హౌస్ లోని గోల్డెన్ జూబ్లీ సమావేశ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 కెవి లెవెన్ కె.వి ఫీడర్లలో అంతరాయాలను తగ్గించాలని, లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మరమ్మతులు చేపట్టాలని, వల్లరేబులు లొకేషన్, లూజ్ లైన్స్, రోడ్ క్రాసింగ్, తక్కువ ఎత్తు ఉన్న ట్రాన్స్ఫార్మర్ దిమ్మలు సరి చేయాలని అన్నారు. ట్రాన్స్ ఫార్మర్స్ ఫెయిల్యూర్ తగ్గించాలని, ముందు వస్తు ఎల్టిలైన్లో/ఎర్తింగ్ చేయాలన్నారు. గ్రామాలకు ప్రత్యేక ఫీడర్స్ ఏర్పాటు చేయాలని, ప్రజా బాట పల్లె బాట లలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. 33 కెవి అనుసంధాన లైన్లను త్వరగా పూర్తి చేయాలని, సింగల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ లకు ఏబీసీచ్చులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను కూడా తగ్గించాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ ఇంజనీర్ వరంగల్ అశోక్, ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ పివి.రాజేశ్వరరావు, డిఇలు అల్జాపూర్ రమేష్, శ్రీనివాసరావు, ఎండి ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర, రఘు, ఏడీలు, ఏఈలు, సబ్ ఇంజనీర్స్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న 33/11 కెవి ఇండోర్ రైతు బజార్ పనులను తనిఖీ చేశారు. నిర్మాణ పనులన్నీ కూడా జులై మాసం వరకు పూర్తి చేసి సాంకేతికంగా కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖానాపూర్ గ్రామంలో సింగిల్ ఫేస్ ట్రాన్స ఫార్మర్ కు ఏ బి స్విచ్ అమర్చడాన్ని పరిశీలించారు.
