ఘనంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0 12,391

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్ఎస్యూఐI 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ  నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో బుధవారం ఎన్.ఎస్.యు.ఐ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.   ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ మాట్లాడుతూ  ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో , కేరళ విద్యార్థి సంఘం, పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్‌లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్‌.ఎస్‌.యు.ఐ ని ఏర్పాటు చేశారని తెలిపారు. నేడు ఎన్ఎస్యుఐ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం గా ఉంది అని ఆయన అన్నారు. ఎన్ ఎస్ యు ఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడే తత్వం నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చి  దిద్దుతుందని అన్నారు. ఎన్.ఎస్.యు.ఐ లో సంఘంలో పని చేసి ఎందరో కేంద్ర,  రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నుంచి మాజీ ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరు వెంకట్ విద్యార్థి  నిరుద్యోగులు పక్షాన గలమెత్తి బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేసినందుకుగాను అధిష్టానం ఆయన కష్టాన్ని గుర్తించి ఎంఎల్సీగా అవకాశం కల్పించిందని, అలాగే  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గతంలో  ఎన్.ఎస్.యు.ఐ  విభాగంలో చురుకుగా పని చేసే గుర్తించి  ఈరోజు టీపీసీసీ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వెంకట్ స్వామి తో పాటు ఎన్ఎస్యూఐi రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్న అందరికి కూడా  కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎన్.ఎస్.యు.ఐ సంఘంలో పని చేసే ప్రతి ఒక్కరూ విద్యారంగ సమస్యలపై అలాగే నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని అలాగే సమాజంలో జరిగే సామాజిక రాజకీయ ఆర్థిక విషయాలపై ఎల్లవేళలా అధ్యయనం చేస్తూ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు నరందీప్, పోచమ్మ గల్లి శివ, రాంపురం శివ,అర్ఫాష్, కౌశిక్, కనకరాజు, రాజు. ప్రభాస్ రాజ్, సందీప్ , రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.