నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేవపల్లి గ్రామంలో బుధవారం ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ ప్రారంభించినట్టు గ్రామ సర్పంచ్ వీరమల్లు సురేష్ తెలిపారు. గిరిరాజ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)కు చెందిన జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్-I వాలంటీర్లు ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 3 వరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు ప్రోగ్రాం అధికారి డా. ఇ. వెంకటరమణ అన్నారు. మొదటి రోజు గ్రామ పంచాయితీ లో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఎన్ ఎస్ ఎస్ యొక్క ప్రాముఖ్యత, గ్రామం లో గల పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వాలంటీర్లకు సూచించారు. తరువాత వాలంటీర్లు గ్రామ పంచాయితీ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి, గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ బలురాజ్ గౌడ్, వార్డు మెంబర్లు, గ్రామ యువత, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, ప్రోగ్రాం అధికారి తదితరులు పాల్గొనారు.
