దేవపల్లి లో ఎన్ ఎస్ ఎస్ శిబిరం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేవపల్లి గ్రామంలో బుధవారం ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ ప్రారంభించినట్టు గ్రామ సర్పంచ్ వీరమల్లు సురేష్ తెలిపారు. గిరిరాజ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)కు చెందిన జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్-I వాలంటీర్లు ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 3 వరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు ప్రోగ్రాం అధికారి డా. ఇ. వెంకటరమణ అన్నారు. మొదటి రోజు గ్రామ పంచాయితీ లో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఎన్ ఎస్ ఎస్ యొక్క ప్రాముఖ్యత,...