ఆర్మూర్, బతుకమ్మ :
జిల్లాలలోని కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీల్లో జనరల్ రిజర్వ్ చేయబడ్డ అన్ని స్థానాల్లో బ్యాక్ వార్డ్ క్యాస్ట్ అభ్యర్థులు తప్పక పోటీ చేసి మన బీసీల సత్తాను చాటాలని తెలంగాణ బీ సీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బి. రమణ గౌడ్ అన్నారు. బుధవారం టీ బీ సీ ఎస్ ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశానుసారం జిల్లా సంఘ కార్యాలయం లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ స్థానాల్లో ఎక్కడైతే జనరల్ రిజర్వేషన్ చేయబడిందో అక్కడ కచ్చితంగా బీసీలు పోటీ చేసి విజయం సాధించే దిశగా ప్రతి ఒక్క బీసీ కులస్తులు పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలన్నారు. బీసీలకు పట్టం కట్టాలని, బీసీల ఐక్యతను నిరూపించుకోవడానికి ఇది చక్కటి అవకాశమన్నారు. మునుముందు ప్రతి ఎలక్షన్ లో మనమేంటో నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లని అన్నారు. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా బీసీలను గెలిపించుకోవాల్సిందిగా ఆయన బీసీ సోదరులను కోరారు. ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడ బీసీలు పోటీ చేసిన అక్కడ మా సంక్షేమ సంఘం తరఫున మద్దతు ఉంటుందని, మన సంఘం యొక్క సహకారం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, స్టేట్ సెక్రటరీ నారా గౌడ్, డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్, జక్కుల కార్తీక్, రేగుల భూలక్ష్మి, నరేష్, నవీన్ పాల్గొన్నారు.
