మోర్తాడ్, బతుకమ్మ: బాల భీంరావు పాఠశాల ప్రవేశ దినాన్ని “విద్యార్థి దినోత్సవం”గా నవంబర్ 7న జరుపుకుంటారు. 1900 సంవత్సరంలో ఈ రోజుననే బాబాసాహెబ్ అంబేడ్కర్ మహారాష్ట్ర సాతారా జిల్లాలోని ప్రతాప్ సింగ్ పాఠశాలకు ప్రవేశించిన తోలిరోజు. ఈ రోజు నుంచే తాను విద్య అభ్యసం ప్రారంభించారు. ఈ ఐతిహాసిక దినాన్ని విద్యార్థులకు అంకితం చేస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం 2017 నవంబర్ 7న “విద్యార్థి దినోత్సవం” గా అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అయితే దేశంలో విద్యా రంగానికి బాబాసాహెబ్ చేసిన కృషిని వెల కట్టలేం. సమస్త విద్యార్థి లోకానికి ఆదర్శ దినం. కావున తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే రోజును విద్య దినోత్సవంగా ప్రకటించాలని “తెలంగాణ లింక్ ” బద్ది గోపాల్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా నిజామాబాద్ సిటీలో జర్నలిస్టులు, అంబేడ్కరైట్ నాయకులు చేతిలో పుస్తకాలు చేబుని విద్య దినోత్సవం నిమిత్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో డా.అంబేడ్కర్ యువజన సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు దళిత సంక్షేమ సంఘం మోర్తాడ్ మండలం అధ్యక్షులు మల్లూరి రాజారాం, గాలి ప్రమోద్ (తిమ్మాపుర్), జర్నలిస్ట్ తలారి ముకేష్, మహేంద్ర బొప్లే, అబ్బా రంజిత్, పలిగిరి రవీందర్, జర్నలిస్ట్ లైన అంగుళి మాలజీ, మామిడి రాజు, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.
