నవంబర్ 7న “విద్యార్థి దినోత్సవం” గా ప్రకటించాలి
మోర్తాడ్, బతుకమ్మ: బాల భీంరావు పాఠశాల ప్రవేశ దినాన్ని "విద్యార్థి దినోత్సవం"గా నవంబర్ 7న జరుపుకుంటారు. 1900 సంవత్సరంలో ఈ రోజుననే బాబాసాహెబ్ అంబేడ్కర్ మహారాష్ట్ర సాతారా జిల్లాలోని ప్రతాప్ సింగ్ పాఠశాలకు ప్రవేశించిన తోలిరోజు. ఈ రోజు నుంచే తాను విద్య అభ్యసం ప్రారంభించారు. ఈ ఐతిహాసిక దినాన్ని విద్యార్థులకు అంకితం చేస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం 2017 నవంబర్ 7న "విద్యార్థి దినోత్సవం" గా అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అయితే దేశంలో విద్యా రంగానికి బాబాసాహెబ్ చేసిన కృషిని వెల కట్టలేం....