27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గంజాయి తరలిస్తున్న ఇద్ధరిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :

ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్ధరిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ పోలీసులు  తెలిపారు. ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ఓ స్టీవేన్ సన్, ఎస్ఐ చంద్రమౌళి అధ్వర్యంలో బుదవారం రాత్రి ఆంకాపూర్ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు రూట్ వాచ్ నిర్వహించారు. రూట్ వాచ్ లో బాగంగా జక్రాన్ పల్లి మండలం తోర్లికోండకు చెందిన నూనే శ్రీకాంత్ ,నూనె కిరణ్ లు ప్రస్తుతం ఆంకాపూర్ లో నివాసం ఉంటున్న వారి బైక్ ను తనికీ చేశారు. వారి బైక్ లో 1600 గ్రాముల ఎండు గంజాయి దోరికింది. వారిద్ధరిని విచారించగా అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి కోనుగోలు చేసిన గంజాయిని గ్రామాలలో ప్యాకేట్ లలో విక్రయిస్తున్నట్లు ఓప్పుకున్నారు. వారిద్ధరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు.Excise police arrested Iddhari who was transporting ganja

 

More articles

Latest article