24 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజకీయాల్లో సంచార జాతులకు అవకాశాలు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాజకీయాల్లో సంచార జాతులకు అవకాశాలు లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తిప్పిరిశెట్టి, ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ద్యారంగుల నగేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశాలు లేవని, రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాలు బీసీల్లో 52, ఎస్సీ ల్లో 10, ఎస్టీ ల్లో 4 కులాలు ఉన్నాయని, జనాభా ప్రకారం బీసీల్లో 12%, ఎస్సీల్లో  20 % ఎస్ టీ ల్లో 10% ఉన్నా పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, సంచార జాతులకు ఒక సీటు కేటాయించి గెలుపు కోసం అధికార పార్టీ కృషి చేయాలని కోరారు. సంచార సామాజిక వర్గాల నుంచి విద్యా వేత్త మదనం గంగాధర్ ప్రజా సేవ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారని, ఆయనకు మద్దతు తెలిపాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో భీమ్ రాజు, మందుల, వేముల రఘు, కుంచెపు ఆనంద్, రాజ్ కుమార్, రమేశ్, గంగాధర్ దండ్ల, గంగారాం, బత్తుల నాగేశ్, తిమ్మయ్య, గంగారాం, పి. శ్రీనివాస్, జిల్లా సంచార జాతి కులాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article