రాజకీయాల్లో సంచార జాతులకు అవకాశాలు ఇవ్వాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాజకీయాల్లో సంచార జాతులకు అవకాశాలు లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తిప్పిరిశెట్టి, ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ద్యారంగుల నగేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశాలు లేవని, రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాలు బీసీల్లో 52, ఎస్సీ ల్లో 10, ఎస్టీ ల్లో 4 కులాలు ఉన్నాయని, జనాభా ప్రకారం...