27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య వర్మ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం తాను 18 సంవత్సరాల నుంచి పోరాడుతున్నానని, అందరి మద్దతుతో మండలి ఎన్నికల బరిలో నిలుస్తున్నానని అన్నారు. తనను ఆదరించాలని కోరారు. సమావేశంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేశ్ యాదవ్, టీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు, టీఎల్ఎఫ్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు గజానంద్, జిల్లా నాయకులు  నవీన్, శ్రీకాంత్, మురళి, విజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. 

More articles

Latest article