26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ స్వధార్ హోమ్ ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

  • కానరాని రికార్డులు
  • నిర్వహణ అస్తవ్యస్థo
  • అధికారిక అనుమతిలేని వైనం
  • సీనియర్ సివిల్ జడ్జి, అదనపు కలెక్టర్, అదనపు పోలీస్ కమిషనర్ ల ఉమ్మడి తనిఖీ

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో, బోధన్ లో కేద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రిడో అనే స్వచ్చంద స్వధార్ హోమ్ ను నిర్వహిస్తున్నది. రిడో కు చైర్మన్ గా ఎమ్. బి చౌదరి ఉన్నారు.వివిధ నేరాలలో, ఇతరేతర సమస్యలలో బాధితులైన మహిళలను ప్రభుత్వ సంస్థలు, న్యాయస్థానాలు స్వధార్ హోమ్ కు పంపించి రక్షణ కల్పిస్తాయి.స్వధార్ హోమ్ లో సరైన రక్షణ ఏర్పాట్లు లేవని, నిధులను క్రమ పద్దతిలో నిర్వాహంచడం లేదనే ఫిర్యాదు కలెక్టర్ కార్యాలయంకు గత సంవత్సరం అందిన నేపథ్యంలో, జనవరి 2025 లో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, పోలీస్ కమిషనర్,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి(సీనియర్ సివిల్ జడ్జి ),డి. ఎమ్. ఎహ్. ఒ,డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్, స్వచ్చంద సేవ సంస్థ స్నేహ సొసైటీ సిద్దయ్య సభ్యులుగా మానిటరింగ్ కమిటీ ని ఏర్పాటు చేశారు.ఆరోపణలు, ఫిర్యాదు స్వధార్ హోమ్ నిర్వహణపై రావడంతో శుక్రవారం నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి లు జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ భీ, స్నేహ సొసైటీ సిద్దయ్య లను వెంటబెట్టుకు ని గౌతమ్ నగర్ లో గల స్వధార్ హోమ్ ను అకస్మికంగా తనిఖీ చేశారు.స్వధార్ హోమ్ చైర్మన్ చౌదరి లేరు. సంబంధిత హోమ్ నిర్వాహకులను అడిగి రికార్డులు చూశారు.ప్రస్తుతం స్వధార్ హోమ్ కు అధికారిక అనుమతి లేదు.రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి లేకుండా హోమ్ నిర్వహణను గుర్తించారు. ఎంతమంది బాధిత మహిళలు ఉన్నారు, ఎంతమంది ప్రవేశం పొందారు అనే వివరాలు కన బడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక నిధుల జమా ఖర్చుల లెక్కల రికార్డులు సరిగా లేవు.ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా హోమ్ నడుస్తున్నది వాకబు చేశారు. హోమ్ నిర్వహణకు లైసెన్స్ తీసుకోక పోవడం కనిపెట్టారు.స్వధార్ హోమ్ లైసెన్స్ ను రద్దు చేస్తూ జిల్లా సంక్షేమ అధికారి జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసి హోమ్ నిర్వహణకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని స్వధార్ హోమ్ నిర్వాహకుడు చౌదరి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేసిన అందులో ఎలాంటి ఉపశనం లభించలేదు. చట్ట ప్రకారమే వ్యవహారించాలని జిల్లా అధికారులకు సూచిస్తూ రిట్ పిటిషన్ ను పరిష్కరించిన తీరును వారు తెలుసుకున్నారు. ఏది ఏమైనా స్వధార్ హోమ్ లో అవకతవకలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపం, చట్టభద్ద లైసెన్స్ లేకపోవడం, సరైన రికార్డులు నిర్వహించకపోవడం, రిడో స్వధార్ హోమ్ నిర్వహణలో జనరల్ బాడీ, దాని మినిట్స్ సరిగా లేకపోవడం ఇత్యాధి లోపాలను జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి ల తనిఖీలో వెళ్ళడయింది.

Nizamabad Swadhar Home surprise inspection

More articles

Latest article