27.3 C
Hyderabad
Friday, July 31, 2026

నిజామాబాద్ జిల్లా ప్రపంచానికే తలమానికం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ప్రపంచానికే తలమానికంగా మారిందని, జిల్లా వారు తెలంగాణ రాష్ట్రానికే కాదు మన దేశానికి వన్నె తెచ్చిపెట్టారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ యోగా ఫెడరేషన్ వారు సాంస్కృతిక ఉత్సవాల 2026 సందర్భంగా శారద ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరులో ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో అంతర్జాతీయ యోగా పోటీలు నిర్వహించారు. అందులో నిజామాబాద్ జిల్లా నుండి అత్యధికంగా బహుమతులు పొందారని ఆయన తెలిపారు. యోగా పోటీలలో జిల్లాకు చెందినవారు ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ నుండి తెలంగాణ రాష్ట్రం తరఫున అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరుకు వెళ్ళగా మేడినేని శ్రీనిక బంగారు పతకం, గోవింద్ వార్ రిషిత బంగారు పతకం, వి శ్రీకాంత్ బంగారు పతకం, బి గాయత్రి బంగారు పతకం, అక్షయ చెట్టిగరి వెండి పతకం, ఆర్ వరేన్య గౌడ్ వెండి పథకం, గొల్ల అఖిల వెండి పతకం, డాక్టర్ ఆనంద్ కుమార్ వెండి పతకం, నందిత శ్రీ బ్రాంజ్, ఆర్ రఘు బ్రాంజ్, పడిగల హర్షిత బ్రాంజ్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టినందుకు ఆది యోగి ఫౌండేషన్ పరమేశ్వర యోగ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినోద్,  చైర్మన్ ఆచార్య యోగ సిద్ధిరాములు, మేకల్ వార్ ఎండి పంచగవ్య, శిక్షకురాలు అండ్ ప్రధాన కార్యదర్శి గాయత్రి ఆనందం వ్యక్తపరిచారు. అలాగే బహుమతి పొందిన విద్యార్థులు శిక్షకురాలు గాయత్రి కి, ఆదియోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article