27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠకులకు అందుబాటులోకి నూతన గ్రంథాలయ భవనం

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి  

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని పాఠకులకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి అన్నారు. మంగళవారం అకస్మికంగా  నూతనంగా నిర్మిస్తున్న శాఖా గ్రంథాలయ భవన పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ త్వరిత గతిన శాఖా గ్రంథాలయ భవన పనులను పూర్తి చేయించి, భవనాన్ని మార్చ్ చివరి వారంలోగా వాడుకలోకి తీసుకు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. రూ.28 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతుందని,భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.త్వరలో తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలండర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నందున భవనాన్ని నిరుద్యోగులకు ఉపయోగంలో కి తీసుకురావాలని తెలిపారు. పాఠకుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని లైబ్రేరియన్ ను ఆదేశించారు. పాఠకులు నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రంథాలయ అభివృద్ధి విషయంపై స్థానిక నాయకులతో అడిగి చర్చలు జరిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,పట్టణ అధ్యక్షులు జె. జె నర్సయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పర్స అనంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు,మాజీ కౌన్సిలర్ లో మల్లెల రాజా శ్రీ లక్ష్మణ్, సిహెచ్ గంగాధర్, ధరావత్ లింగయ్య, (లింగం) మైనార్టీ జర్నల్ సెక్రెటరీ మహమ్మద్ జీషాన్, సాయిబాబా, మొండి దినేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article