నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కి పాత డిసిపి బస్వారెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో నగ్రాలే శుభం ప్రకాష్ నూతన డిసిపిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కార్యాలయం లో గురువారం పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ని మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ అదనపు డి.సి.పి (అడ్మిన్) ని స్వాగతిస్తూ అభినందించారు.
