- ఉదార సేవ పట్ల ప్రజల ప్రశంసలు
- కాంగ్రెస్ పార్టీ నాయకులు జిలకర సత్యనారాయణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో సామాజిక సేవకు మరో ముందడుగు పడింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, (కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు) జిలకర సత్యనారాయణ తన సొంత ఖర్చుతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి ఆదివారం రోజు పెయింటింగ్ పనులు చేపట్టి, పాఠశాలలకు నూతన బోర్డులు రాయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ గారు తమ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. నేనూ సామాజిక బాధ్యతగా నా వంతు సేవ చేయాలనిపించింది. బడులు, చిన్నారుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చేయగలిగినంత చేయాలి” అన్నారు. ఈ సేవా కార్యక్రమం మాత్రమే కాదు, గతంలో కూడా సత్యనారాయణ గారు విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి బెంచీలు, బ్లాక్ బోర్డులు అందజేసిన విషయం గుర్తుంచుకోవాలి. విద్యా రంగాన్ని మెరుగుపరచడంలో ఆయన విశేష ఆసక్తి చూపుతుండడాన్ని గ్రామస్థులు ఎంతో ప్రశంసిస్తున్నారు. సబ్దల్పూర్ గ్రామస్థులు మాట్లాడుతూ: “ఇలాంటి నాయకులు ప్రతి గ్రామానికీ అవసరం. రాజకీయ భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధికి ముందడుగు వేసే నాయకులు మనకు మార్గదర్శకులు. జిలకర సత్యనారాయణ గారి సేవాప్రవృత్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.” ఇలాంటి మంచి పనులకు ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు ప్రోత్సాహం అందించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలన్న సందేశాన్ని ఈ చర్య అందరికీ స్ఫూర్తిదాయకం.
