25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు 

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అంతర్జాతీయంగా ఉత్తమ పరిశోధనలతో  తెలంగాణ విశ్వవిద్యాలయానికి గుర్తింపు తీసుకురావాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు  అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాషూటికల్  కెమిస్ట్రీ విభాగానికి చెందిన వెన్నెల, కృష్ణ ప్రకాష్ లు  తైవాన్ లోని నేషనల్ డాంగువా యూనివర్సిటీలో  పీహెచ్డీ ప్రవేశం పొందారు.  ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో విద్యార్థులను అభినందించి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ అడ్మిషన్ దక్కించుకోవడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని  పేర్కొన్నారు. భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగంలో  అద్భుతమైన పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయానికి గుర్తింపు తేవాలని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈ అడ్మిషన్లు సాధించుటకు కృషి చేస్తున్న డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ మావురపు సత్యనారాయణ, డాక్టర్ శిరీష బోయపాటి లను  వీ సి  అభినందించి భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు అంతర్జాతీయంగా స్థిరపడే విధంగా సలహాలు సూచనలు అందించాలన్నారు.

More articles

Latest article