24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ కస్టడీ మృతిపై ఎన్ఎచ్ఆర్సీలో ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పోలీస్ కస్టడీలో సంపత్ అనే వ్యక్తి మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైదరాబాద్ కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో సంపత్ అనే వ్యక్తిని  సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని చట్టపరంగా విచారించకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా హింసించారన్నారు. దీంతో ఆయన మరణించారని తెలిపారు. మృతి చెందిన సంపత్ తన కుటుంబానికి జీవనాధారం కావడం వల్ల ఆయన కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అన్నారు. ఈ లాక్ అప్ డెత్ పై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి సంఘటనకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకొని మృతుని కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించి తగిన సాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కోరినట్లు న్యాయవాది రేవంత్ తెలిపారు.అదే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎంతటి విచారణ అయిన చట్టానికి లోబడే చేయాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.

Complaint to National Human Rights Commission on Lockup Death

More articles

Latest article