బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండల కేంద్రము గోపాల్ పేట్ గ్రామ వారాంతపు సంత తైబజార్ వేలంపాటను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. ఈ వేలంపాటలో ఐదుగురు వ్యక్తులు పాల్గొనగా, తైబజార్ వేలం నాలుగు లక్షల 57 వేల రూపాయలు కాగా, నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన కంచనపల్లి సాయిబాబా గౌడ్ ఐదు లక్షల రూపాయలకు అత్యధికంగా వేలంపాడి కైవసం చేసుకున్నారని పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తెలిపారు. తైబజార్ వచ్చే ఏప్రిల్ ఒకటి నుండి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఫరీద్, వంశీకృష్ణ గౌడ్, షాహిద్ పాషా, బాబురావు, మచ్చేందర్ గౌడ్, మంగలి యాదగిరి, సంతోష్ గౌడ్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
