27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నాగిరెడ్డిపేట ఎంపీడీవో, ఎంపీవోలపై వేటు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా  విధులలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై అధికార యంత్రాంగం వేటు వేసింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ అధికారులపై యాక్షన్ తీసుకోవడంతో  గుబులు మొదలైంది.  కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్ చారీల పై సస్పెండ్ చేస్తు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మండలంలో నామినేషన్ల  స్వీకరణ తాలుకా సమాచారంలో అధికారులు నిర్లక్ష్యం  ఉండటంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదలి వెళ్లడమే కాకుండా, నామినేషన్ల వివరాలను అధికారులకు అందించడంలో నిర్లక్ష్యం వహించడంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.


Nagireddypet MPDO and MPO suspended

More articles

Latest article