భీమ్ గల్, బతుకమ్మ : మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి సోమవారం సెకండ్ క్లాస్ మేజస్ట్రెట్ గట్టు గంగాధర్ రెండు రోజుల జైల్ శిక్షను విధించారు. నిజామాబాద్ కు చెందిన శేఖ్ చంద్ పాషా భీమ్ గల్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం త్రాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు పాషాను బీ ఏ సీ చెక్ చేయగా 311 లెవల్ రిజల్ట్ రాగ త్రాగి వాహనం నడుపుతున్నట్లు రుజువు కాగా కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కేసును పరిశీలించిన సెకండ్ క్లాస్ జడ్జి నిందితునికి రెండు రోజుల జైలు శిక్షను విధించారు.
