24 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీస్ బాస్ కు తలనొప్పిగా మారిన ముదుర్లు

Must read

📰 Generate e-Paper Clip

  • మొన్న టాస్క్ ఫోర్స్
  • నేడు సీసీఎస్ చుట్టూ వివాదాలు
  • టాస్క్ ఫోర్స్  టీంలను తొలగించిన సీపీ
  • సీసీఎస్ లో ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీతో ప్రక్షాళన..?
  • బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు ఉంటాయా? 

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ పోలీస్ బాస్ కు  శాఖలోని ముదుర్లు తలనొప్పిగా మారారు. వారు ఏసీపీలు కారు.. సిఐలు అంతకన్నా కాదు.. ఎస్సైలు అసలే కాదుకాదు. కాని వారు అంటే జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖలో ఆయా విభాగాలకు కేరాఫ్. వారులేకుండా ఎలాంటి పనులు జరుగవు (దొంగలు దొరుకాలన్న,హంతకుడు పట్టుబడాలన్న, వైట్ కాలర్ నేరగాళ్ల, రౌడీ షీటర్లు, గంజాయి పేడ్లర్లు, మట్కా షీటర్ లు, చివరకు పత్తాలాటనిర్వహకులు, ఆన్ లైన్ బెట్టింగ్ (ఐడి ఇచ్చేవారు), రేషన్ బియ్యం ని బ్లాక్ లోఅమ్ముకునే వారు, జీరో దందాలు, ఫోర్జరీ డాక్యూమెంట్స్ ల రూపకర్తలు, వడ్డీ వ్యాపారులుదొరకాలంటే ) కింది స్థాయి సిబ్బంది కీలకం. జిల్లాకు పోలీస్ బాస్ లు, ఎసిపిలు, సిఐలు, ఎస్ఐలు వస్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోకల్ అనుచందంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మరి కొంత మంది ఏఎస్ఐలు పలు విభాగాల్లో పాతుకు పోయారు. అందులోప్రధానంగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ పోర్స్, సీసీఎస్, ట్రాఫిక్ విభాగాలు కీలకమైనవి. ఇందులో ప్రధానంగా నేరాల, అసాంఘీక కార్యకలాపాలు  నియంత్రణలో లోకల్ పోలీసులకు సంబంధం లేకుండా టాస్క్ ఫోర్స్, సీసీఎస్ టీంలు ప్రధానమైనవి. జిల్లాపోలీస్ కమిషనర్ కనుసన్నుల్లో నడిచే ఈ రెండు విభాగాలు ఇప్పుడు వివాదాల సుడిగుండంలో మునిగి తేలుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్నసుభాష్ అనే కానిస్టేబుల్ ను సిరికొండ పీఎస్ కు, నీలేష్  ను బోధన్కు బదిలీ చేశారు. అయితే ఇద్దరు కానిస్టేబుళ్లు బదిలీ ఎందుకు జరిగింది అధికారులు వెల్లడించ లేదు. గత నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్, రౌడీషీటర్ రియాజ్ చేతిలో హతమైన విషయం తెలిసిందే. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఆరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత పరారీలో ఉన్న రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకునేందుకు పురమాయించింది ఎవరు..? ఈ ఘటనలో కానిస్టేబుల్ హతమైన శాఖ పరమైన విచారణలో ఏమితేలింది బహిర్గతం కాలేదు. చాలామంది రౌడీ షీటర్లు, దొంగలు, నేరగాళ్లు యదేచ్చగా బయటతిరగడం (అబ్ స్కాండింగ్ ) వెనుక పోలీస్ శాఖకు చెందిన ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. నేరస్థులతో టచ్ లోఉంటు వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి వారు పరారీలో ఉన్నారని చెప్పడం వెనుక ఉద్దేశం కిందిస్థాయి సిబ్బందికి  తెలిసినంతగా అదికారులకు తెలియదు. దానితో సీసీఎస్ లో కొందరు ముదుర్లను వదిలేసి ప్రక్షాళన పేరిట ఇద్దరిని బదిలీ చేశారు అని పోలీస్ శాఖ అంతా కోడై కూస్తోంది. సీసీఎస్ లోజరుగుతున్న వ్యవహారాలను బయటకు లీక్ చేస్తున్న, వసూళ్ల రాయుళ్లను వదిలి వేయడం పై విమర్శలు ఉన్నాయి.

Mudurlu becomes a headache for the police boss

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కీలక విభాగాల్లోఉన్న ముదుర్ల వ్యవహారం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా ఉంది. పోలీస్ బాస్ సైతం వారిపై చర్యలు తీసుకోకుండా కంటితుడుపు చర్యగా బదిలీ చేయడంతో అధికారులు, సిబ్బంది లో భయంలేకుండా పోయింది. ఈ ఏడాదిలోనే జరిగిన ప్రధాన సంఘటనలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో కీలకమైన టాస్క్ ఫోర్స్ లోముదుర్లు నేరస్థులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతు అందినకాడికి దండుకున్నారు. ఏకంగా నిర్వాహకులతో లక్షల మామూళ్లు వసూలు జరుగడంతో మొత్తానికి టాస్క్ ఫోర్స్ టీం లో అందరిని బదిలీ చేశారు. గత మూడు నెలల కాలంలో టాస్క్ ఫోర్స్ నియామకం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ లో జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహరంలో ఒ కానిస్టేబుల్ హోంగార్డులను బాధ్యులను చేసే వారిని కమిషనరేట్ కు అటాచ్ చేశారు. మరివారు వసూళ్లు చేసింది ఎవ్వరి కోసం, మాముళ్లు ఎవ్వరికి చేరాయనే విషయంపై విచారణ జరిగినట్లు గాని అందులో ప్రమేయం ఉన్న వారికి నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సీసీఎస్ వ్యవహారంలో ముదుర్లపై విచారణ జరుగుతుందా, బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది.

More articles

Latest article