హైదరాబాద్, బతుకమ్మ : 42శాతం బీసీ రిజర్వేషన్, బీసీల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత, మేడే బాపురాజు, వీరమల్ల శారద, శివ పటేల్ తెలంగాణ జాగృతి లో చేరారు. వారికి కవిత కండువా కప్పి ఆహ్వానించారు. చెంగిచర్ల ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కవితకు మద్దతు ప్రకటించారు.

