24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంపిటిసి స్థానాన్ని ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: ఉమ్మడి మద్నూర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని ధోతి, మల్లాపూర్, మారేపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను కలుపుకొని ఎంపిటిసి స్థానాన్ని కేటాయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గురువారం ఆ గ్రామస్తులు వెళ్లి జిల్లా పరిషత్ సీఈఓ కు వినతి పత్రం అందజేశారు. అధికారులు డోంగ్లి మండల కేంద్రంలోని మొగ, మారేపల్లి, మల్లాపూర్, ధోతి, గ్రామ పంచాయతీలను కలుపుకొని ఎంపిటిసి స్థానాన్ని కేటాయించారు. ఓటర్ల సంఖ్య ఐదు వేలకు పైగా అవుతుంది. మొగ గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎక్కువ, మా గ్రామాలకు దూరం కావున ఎంపిటిసి స్థానంలో నుంచి మూగ గ్రామం తొలగించి మా మూడు గ్రామ పంచాయితీలకు ఎంపిటిసి స్థానం కేటాయించాలని కోరారు. మాజీ ఎంపిటిసి మాన్ కాలే సంజు, మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్, శ్రీకాంత్ పటేల్, అమృత్ వార్ శ్రీకాంత్, రవికుమార్, సంజయ్, బాబుమియా, రామ్ గోండ ఉన్నారు.

More articles

Latest article