28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటింటా మొక్కల పంపిణీ చేసిన ఎంపీడీవో శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఇంటింటా తిరుగుతూ గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమని, ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటడం వల్ల పచ్చదనం పెరిగి వర్షపాతం మెరుగుపడటానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాము, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ ఉషారాణి సదు పటేల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article