ఇంటింటా మొక్కల పంపిణీ చేసిన ఎంపీడీవో శ్రీనివాస్

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఇంటింటా తిరుగుతూ గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమని, ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటడం వల్ల పచ్చదనం పెరిగి వర్షపాతం మెరుగుపడటానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ...